![]() |
![]() |

జోర్దార్ సుజాత బక్కగా ఉంటుంది కానీ మంచి బలంగా ఉంటుంది. ఐతే సుజాత తనకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటోంది. ఇంతకు ఆ టాలెంట్ ఏంటబ్బా అని చూస్తీ ఇది... ఆమె బలం, ఆమె టాలెంట్ ఆమె చేసే స్కిట్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి సుజాత రాకేష్ తో అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్..ఐతే పెళ్ళికి ముందు సుజాత ఎలా ఉందొ పెళ్లయ్యాక కూడా సుజాత అలాగే ఉంది. కొంచెం కూడా బాడీ రాలేదు. స్లిమ్ గా ట్రిమ్ గా అలానే ఉంది.
ఐతే చాలామందికి పెళ్లయ్యాక లావైపోతూ వచ్చిన బాడీని తగ్గించుకోలేక అవస్థలు పడుతూ ఉంటారు. ఐతే సుజాత ఈ విషయంలో చాలా గొప్పగా ఫీలవుతోంది. దాని మీద ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మేం బక్కోళ్ళం బ్రో..లావవ్వడం మాకు అసలు పాజిబుల్ కానీ కాదు..ఎంత తిన్నాసరే చెప్తున్నాగా ఎంత తిన్నా సరే వంద గ్రాముల వెయిట్ కూడా పెరగం..అదిదా మా స్పెషల్ టాలెంట్" అంటూ తానూ వేసుకున్న డ్రెస్ లో తానెంత సన్నగా ఉందో చూపించింది సుజాత.
ఇక నెటిజన్స్ ఐతే "అంతే ఆంటీ..మరి లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని అడుగుతున్నారు. కమెడియన్ రాకింగ్ రాకేశ్ తో, జోర్దార్ సుజాత ప్రేమ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుజాత బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చింది. వీరిద్దరి లవ్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ రొమాన్స్ పండిస్తోంది. ఈ ఇద్దరూ టీవీ షోస్ లో ఎన్నో సార్లు ప్రొపోజ్ చేసుకున్నారు. ఇక చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. "సేవ్ ది టైగర్స్" వెబ్ సిరీస్ లో జోర్దార్ సుజాత నటన పీక్స్ ఉంటుంది. తెలంగాణ యాసతో చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు.
![]() |
![]() |